Psalm 26:10
వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడిచెయ్యి లంచములతో నిండియున్నది.
Psalm 26:10 in Other Translations
King James Version (KJV)
In whose hands is mischief, and their right hand is full of bribes.
American Standard Version (ASV)
In whose hands is wickedness, And their right hand is full of bribes.
Bible in Basic English (BBE)
In whose hands are evil designs, and whose right hands take money for judging falsely.
Darby English Bible (DBY)
In whose hands are evil devices, and their right hand is full of bribes.
Webster's Bible (WBT)
In whose hands is mischief, and their right hand is full of bribes.
World English Bible (WEB)
In whose hands is wickedness, Their right hand is full of bribes.
Young's Literal Translation (YLT)
In whose hand `is' a wicked device, And their right hand `is' full of bribes.
| In whose | אֲשֶׁר | ʾăšer | uh-SHER |
| hands | בִּידֵיהֶ֥ם | bîdêhem | bee-day-HEM |
| is mischief, | זִמָּ֑ה | zimmâ | zee-MA |
| hand right their and | וִֽ֝ימִינָ֗ם | wîmînām | VEE-mee-NAHM |
| is full | מָ֣לְאָה | mālĕʾâ | MA-leh-ah |
| of bribes. | שֹּֽׁחַד׃ | šōḥad | SHOH-hahd |
Cross Reference
1 Samuel 8:3
వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా
Deuteronomy 16:19
నీవు న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు; పక్షపాతము చేయకూడదు; లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్ను లకు గ్రుడ్డితనము కలుగజేయును నీతి మంతుల మాటలకు అపార్థము పుట్టించును.
Exodus 23:8
లంచము తీసి కొనకూడదు; లంచము దృష్టిగలవానికి గ్రుడ్డితనము కలుగజేసి, నీతిమంతుల మాట లకు అపార్థము చేయిం చును.
Acts 23:12
ఈ కుట్రలో చేరినవారు నలుబదిమంది కంటె ఎక్కువ.
Matthew 26:3
ఆ సమయ మున ప్రధానయాజకులును ప్రజల పెద్దలును కయప అను ప్రధానయాజకుని మందిరములోనికి కూడివచ్చి
Micah 7:3
రెండు చేతులతోను కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. ఆలాగున వారు ఏకపట్టుగానుండి దాని ముగింతురు.
Micah 2:1
మంచములమీద పరుండి మోసపు క్రియలు యోచిం చుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ; ఆలాగు చేయుట వారి స్వాధీనములో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు.
Amos 5:12
మీ అప రాధములు విస్తారములైనవనియు, మీ పాపములు ఘోర మైనవనియు నేనెరుగుదును. దరిద్రులయొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కు దురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లుకట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు, శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు.
Ezekiel 22:12
నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంత ముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Isaiah 33:15
నీతిని అనుసరించి నడచుచు యథార్థముగా మాట లాడుచు నిర్బంధనవలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండ తన చేతులను మలుపుకొని హత్య యను మాట వినకుండ చెవులు మూసికొని చెడుతనము చూడకుండ కన్నులు మూసికొనువాడు ఉన్నతస్థలమున నివసించును.
Proverbs 4:16
అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు.
Proverbs 1:16
కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు.
Psalm 55:9
పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము.
Psalm 52:2
మోసము చేయువాడా, వాడిగల మంగల కత్తివలె నీ నాలుక నాశనము చేయ నుద్దేశించుచున్నది
Psalm 36:4
వాడు మంచముమీదనే పాపయోచనను యోచిం చును వాడు కానినడతలు నడచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు.
Psalm 11:2
దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారుచీకటిలో యథార్థహృదయులమీద వేయుటకైతమ బాణములు నారియందు సంధించి యున్నారు
Psalm 10:14
నీవు దీనిని చూచి యున్నావు గదా, వారికి ప్రతికారము చేయుటకైనీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావునిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురుతండ్రిలేనివారికి నీవే సహాయుడవై యున్నావు