Job 10

1 నా బ్రదుకునందు నాకు విసుకు పుట్టినదినేను అడ్డులేకుండ అంగలార్చెదనునా మనోవ్యాకులము కొలది నేను పలికెదను

2 నా మీద నేరము మోపకుండుమునీవేల నాతో వ్యాజ్యెమాడుచున్నావో నాకు తెలియ జేయుమని నేను దేవునితో చెప్పెదను.

3 దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచనమీద దయా దృష్టియుంచుటసంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా?

4 నీ నేత్రములు నరుల నేత్రములవంటివా? నరులు ఆలోచించునట్లు నీవు ఆలోచించు వాడవా?

5 నీ జీవితకాలము నరుల జీవిత కాలమువంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినములవంటివా?

6 నేను దోషిని కాననియునీ చేతిలోనుండి విడిపింపగలవాడెవడును లేడనియు నీవు ఎరిగియుండియు

7 నీవేల నా దోషమునుగూర్చి విచారణ చేయుచున్నావు? నా పాపమును ఏల వెదకుచున్నావు?

8 నీ హస్తములు నాకు అవయవ నిర్మాణముచేసి నన్ను రూపించి యున్ననునీవు నన్ను మింగివేయుచున్నావు.

9 జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి,ఆ సంగతి జ్ఞాపకము చేసికొనుమునీవు నన్ను మరల మన్నుగా చేయుదువా?

10 ఒకడు పాలుపోసినట్లు నీవు నన్ను పోసితివిగదాజున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా.

11 చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివిఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి.

12 జీవము ననుగ్రహించి నాయెడల కృప చూపితివినీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి.

13 అయినను నా లోపములనుగూర్చి నీవు నీ హృదయ ములో ఆలోచించితివిఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును.

14 నేను పాపము చేసినయెడల నీవు దాని కనిపెట్టుదువునా దోషమునకు పరిహారము చేయకుందువు.

15 నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధకలుగునునేను నిర్దోషినై యుండినను అతిశయపడను అవమానముతో నిండుకొనినాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను.

16 ­నేను సంతోషించినయెడలఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నామీద చూపుదువు.

17 సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువుఎడతెగక నామీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవుఎడతెగక నామీద నీ ఉగ్రతను పెంచెదవుఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు.

18 గర్భములోనుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి? అప్పుడే యెవరును నన్ను చూడకుండ నేను ప్రాణము విడిచి యుండినయెడల మేలు;

19 అప్పుడు నేను లేనట్లే యుండియుందునుగర్భములోనుండి సమాధికి కొనిపోబడియుందును.

20 నా దినములు కొంచెమే గదాతిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు

21 అంధకారము మరణాంధకారముగల దేశమునకు

22 కటికచీకటియై గాఢాంధకారమయమైన దేశమునకుభ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకువెలుగే చీకటిగాగల దేశమునకు నేను వెళ్లక ముందుకొంతసేపు నేను తెప్పరిల్లునట్లునన్ను విడిచి నా జోలికి రాకుండుము.

1 My soul is weary of my life; I will leave my complaint upon myself; I will speak in the bitterness of my soul.

2 I will say unto God, Do not condemn me; shew me wherefore thou contendest with me.

3 Is it good unto thee that thou shouldest oppress, that thou shouldest despise the work of thine hands, and shine upon the counsel of the wicked?

4 Hast thou eyes of flesh? or seest thou as man seeth?

5 Are thy days as the days of man? are thy years as man’s days,

6 That thou inquirest after mine iniquity, and searchest after my sin?

7 Thou knowest that I am not wicked; and there is none that can deliver out of thine hand.

8 Thine hands have made me and fashioned me together round about; yet thou dost destroy me.

9 Remember, I beseech thee, that thou hast made me as the clay; and wilt thou bring me into dust again?

10 Hast thou not poured me out as milk, and curdled me like cheese?

11 Thou hast clothed me with skin and flesh, and hast fenced me with bones and sinews.

12 Thou hast granted me life and favour, and thy visitation hath preserved my spirit.

13 And these things hast thou hid in thine heart: I know that this is with thee.

14 If I sin, then thou markest me, and thou wilt not acquit me from mine iniquity.

15 If I be wicked, woe unto me; and if I be righteous, yet will I not lift up my head. I am full of confusion; therefore see thou mine affliction;

16 For it increaseth. Thou huntest me as a fierce lion: and again thou shewest thyself marvellous upon me.

17 Thou renewest thy witnesses against me, and increasest thine indignation upon me; changes and war are against me.

18 Wherefore then hast thou brought me forth out of the womb? Oh that I had given up the ghost, and no eye had seen me!

19 I should have been as though I had not been; I should have been carried from the womb to the grave.

20 Are not my days few? cease then, and let me alone, that I may take comfort a little,

21 Before I go whence I shall not return, even to the land of darkness and the shadow of death;

22 A land of darkness, as darkness itself; and of the shadow of death, without any order, and where the light is as darkness.

Job 12 in Tamil and English

1 అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తర...మిచ్చెను
And Job answered and said,

2 నిజముగా లోకములో మీరే జనులుమీతోనే జ్ఞానము గతించి పోవును.
No doubt but ye are the people, and wisdom shall die with you.

3 అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగియున్నదినేను మీకంటె తక్కువజ్ఞానము కలవాడను కానుమీరు చెప్పినవాటిని ఎరుగనివాడెవడు?దేవునికి మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను
But I have understanding as well as you; I am not inferior to you: yea, who knoweth not such things as these?

4 నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను.నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను.
I am as one mocked of his neighbour, who calleth upon God, and he answereth him: the just upright man is laughed to scorn.

5 దుర్దశ నొందినవానిని తిరస్కరించుట క్షేమముగలవారు యుక్తమనుకొందురు.కాలుజారువారికొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది.
He that is ready to slip with his feet is as a lamp despised in the thought of him that is at ease.

6 దోపిడిగాండ్ర కాపురములు వర్థిల్లునుదేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగానుందురువారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు.
The tabernacles of robbers prosper, and they that provoke God are secure; into whose hand God bringeth abundantly.

7 అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించునుఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును.
But ask now the beasts, and they shall teach thee; and the fowls of the air, and they shall tell thee:

8 భూమినిగూర్చి ధ్యానించినయెడల అది నీకు భోధించునుసముద్రములోని చేపలును నీకు దాని వివరించును
Or speak to the earth, and it shall teach thee: and the fishes of the sea shall declare unto thee.

9 వీటి అన్నిటినిబట్టి యోచించుకొనినయెడలయెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొనలేనివాడెవడు?
Who knoweth not in all these that the hand of the Lord hath wrought this?

10 జీవరాసుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలును ఆయన వశమున నున్నవి గదా.
In whose hand is the soul of every living thing, and the breath of all mankind.

11 అంగిలి ఆహారమును రుచి చూచునట్లుచెవి మాటలను పరీక్షింపదా?
Doth not the ear try words? and the mouth taste his meat?

12 వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన కలుగుచున్నది. అని మీరు చెప్పుదురు
With the ancient is wisdom; and in length of days understanding.

13 జ్ఞానశౌర్యములు ఆయనయొద్ద ఉన్నవిఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు.
With him is wisdom and strength, he hath counsel and understanding.

14 ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరును మరలకట్టజాలరుఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికిని సాధ్యము కాదు.
Behold, he breaketh down, and it cannot be built again: he shutteth up a man, and there can be no opening.

15 ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవునువాటిని ప్రవహింపనియ్యగా అవి భూమిని ముంచివేయును.
Behold, he withholdeth the waters, and they dry up: also he sendeth them out, and they overturn the earth.

16 బలమును జ్ఞానమును ఆయనకు స్వభావలక్షణములుమోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశ మున నున్నారు.
With him is strength and wisdom: the deceived and the deceiver are his.

17 ఆలోచనకర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును.న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచును.
He leadeth counsellers away spoiled, and maketh the judges fools.

18 రాజుల అధికారమును ఆయన కొట్టివేయునువారి నడుములకు గొలుసులు కట్టును.
He looseth the bond of kings, and girdeth their loins with a girdle.

19 యాజకులను వస్త్రహీనులనుగాచేసి వారిని తోడుకొని పోవునుస్థిరముగా నాటుకొనినవారిని ఆయన పడగొట్టును.
He leadeth princes away spoiled, and overthroweth the mighty.

20 వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్థకము చేయునుపెద్దలను బుద్ధిలేనివారినిగా చేయును.
He removeth away the speech of the trusty, and taketh away the understanding of the aged.

21 అధిపతులను ఆయన తిరస్కారము చేయును బలాఢ్యుల నడికట్లను విప్పును.
He poureth contempt upon princes, and weakeneth the strength of the mighty.

22 చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచుమరణాంధకారమును వెలుగులోనికి రప్పించును
He discovereth deep things out of darkness, and bringeth out to light the shadow of death.

23 జనములను విస్తరింపజేయును నిర్మూలముచేయునుసరిహద్దులను విశాలపరచును జనములను కొనిపోవును.
He increaseth the nations, and destroyeth them: he enlargeth the nations, and straiteneth them again.

24 భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్థక పరచునుత్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ చేయును.
He taketh away the heart of the chief of the people of the earth, and causeth them to wander in a wilderness where there is no way.

25 వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురుమత్తుగొనినవాడు తూలునట్లు ఆయన వారిని తూలచేయును.
They grope in the dark without light, and he maketh them to stagger like a drunken man.