Luke 7:34
మనుష్య కుమారుడు తినుచును, త్రాగు చును వచ్చెను గనుక మీరుఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితు డును అను చున్నారు.
The | ἐλήλυθεν | elēlythen | ay-LAY-lyoo-thane |
Son | ὁ | ho | oh |
υἱὸς | huios | yoo-OSE | |
of man | τοῦ | tou | too |
come is | ἀνθρώπου | anthrōpou | an-THROH-poo |
eating | ἐσθίων | esthiōn | ay-STHEE-one |
and | καὶ | kai | kay |
drinking; | πίνων | pinōn | PEE-none |
and | καὶ | kai | kay |
ye say, | λέγετε | legete | LAY-gay-tay |
Behold | Ἰδού, | idou | ee-THOO |
a gluttonous | ἄνθρωπος | anthrōpos | AN-throh-pose |
man, | φάγος | phagos | FA-gose |
and | καὶ | kai | kay |
a winebibber, | οἰνοπότης | oinopotēs | oo-noh-POH-tase |
friend a | τελωνῶν | telōnōn | tay-loh-NONE |
of publicans | φίλος | philos | FEEL-ose |
and | καὶ | kai | kay |
sinners! | ἁμαρτωλῶν | hamartōlōn | a-mahr-toh-LONE |
Cross Reference
Luke 15:2
పరిసయ్యులును శాస్త్రులును అది చూచిఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనిరి.
Matthew 9:11
పరిసయ్యులు అది చూచిమీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి.
Luke 5:29
ఆ లేవి, తన యింట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులును ఇతరులు అనేకులును వారితో కూడ భోజన మునకు కూర్చుండిరి.
Luke 7:36
పరిసయ్యులలో ఒకడు తనతో కూడ భోజనము చేయ వలెనని ఆయననడిగెను. ఆయన ఆ పరిసయ్యుని యింటికి వెళ్లి, భోజనపంక్తిని కూర్చుండగా
Luke 14:1
విశ్రాంతిదినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని యింటిలోనికి వెళ్లినప్పుడు, ఆయన ఏమి చేయునో అని వారాయనను కనిపెట్టు చుండిరి.
Luke 19:7
అందరు అది చూచి ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి.
John 12:2
మార్త ఉపచారము చేసెను; లాజరు ఆయనతో కూడ భోజమునకు కూర్చున్నవారిలో ఒకడు.
Luke 11:37
ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడ భోజనము చేయుమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్లి భోజనపంక్తిని కూర్చుండెను.
John 2:2
యేసు తల్లి అక్కడ ఉండెను; యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువ బడిరి.