Psalm 13

1 యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా?నాకెంతకాలము విముఖుడవై యుందువు?

2 ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును?ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖా క్రాంతుడనై యుందును?ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును?

3 యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము

4 నేను మరణనిద్ర నొందకుండనువాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండనునేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండనునా కన్నులకు వెలుగిమ్ము.

5 నేనైతే నీ కృపయందు నమి్మక యుంచి యున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నదియెహోవా

6 నాకు మహోపకారములు చేసియున్నాడునేను ఆయనను కీర్తించెదను.

1 To the chief Musician, A Psalm of David.

2 How long wilt thou forget me, O Lord? for ever? how long wilt thou hide thy face from me?

3 How long shall I take counsel in my soul, having sorrow in my heart daily? how long shall mine enemy be exalted over me?

4 Consider and hear me, O Lord my God: lighten mine eyes, lest I sleep the sleep of death;

5 Lest mine enemy say, I have prevailed against him; and those that trouble me rejoice when I am moved.

6 But I have trusted in thy mercy; my heart shall rejoice in thy salvation.

7 I will sing unto the Lord, because he hath dealt bountifully with me.

Psalm 82 in Tamil and English

0
A Psalm of Asaph.

1 దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు.
God standeth in the congregation of the mighty; he judgeth among the gods.

2 ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పుతీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనులయెడల పక్షపాతము చూపు దురు?(సెలా.)
How long will ye judge unjustly, and accept the persons of the wicked? Selah.

3 పేదలకును తలిదండ్రులులేనివారికిని న్యాయము తీర్చుడి శ్రమగలవారికిని దీనులకును న్యాయము తీర్చుడి.
Defend the poor and fatherless: do justice to the afflicted and needy.

4 దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలోనుండి వారిని తప్పించుడి.
Deliver the poor and needy: rid them out of the hand of the wicked.

5 జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములన్నియు కదలుచున్నవి.
They know not, neither will they understand; they walk on in darkness: all the foundations of the earth are out of course.

6 మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెల విచ్చియున్నాను.
I have said, Ye are gods; and all of you are children of the most High.

7 అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు.
But ye shall die like men, and fall like one of the princes.

8 దేవా లెమ్కు, భూమికి తీర్పు తీర్చుము అన్యజనులందరు నీకే స్వాస్థ్యముగా ఉందురు.
Arise, O God, judge the earth: for thou shalt inherit all nations.