2 Corinthians 11:1
కొంచెమవివేకముగా నేను మాటలాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను, నన్నుగూర్చి మీరేలా గైనను సహించుడి.
2 Corinthians 11:1 in Other Translations
King James Version (KJV)
Would to God ye could bear with me a little in my folly: and indeed bear with me.
American Standard Version (ASV)
Would that ye could bear with me in a little foolishness: but indeed ye do bear with me.
Bible in Basic English (BBE)
Put up with me if I am a little foolish: but, truly, you do put up with me.
Darby English Bible (DBY)
Would that ye would bear with me [in] a little folly; but indeed bear with me.
World English Bible (WEB)
I wish that you would bear with me in a little foolishness, but indeed you do bear with me.
Young's Literal Translation (YLT)
O that ye were bearing with me a little of the folly, but ye also do bear with me:
| Would to God | Ὄφελον | ophelon | OH-fay-lone |
| ye could bear | ἀνείχεσθέ | aneichesthe | ah-NEE-hay-STHAY |
| with me | μου | mou | moo |
| little a | μικρόν | mikron | mee-KRONE |
| in | τῇ | tē | tay |
| my folly: | ἀφροσύνη | aphrosynē | ah-froh-SYOO-nay |
| and | ἀλλὰ | alla | al-LA |
| indeed | καὶ | kai | kay |
| bear | ἀνέχεσθέ | anechesthe | ah-NAY-hay-STHAY |
| with me. | μου | mou | moo |
Cross Reference
2 కొరింథీయులకు 11:19
మీరు వివేకులైయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు.
2 కొరింథీయులకు 11:4
ఏలయనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను,మీరు అంగీ కరింపని మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానినిగూర్చి సహించుట యుక్తమే.
2 కొరింథీయులకు 5:13
ఏలయనగా మేము వెఱ్రివారమైతిమా దేవుని నిమిత్తమే; స్వస్థబుద్ధిగలవారమైతిమా మీ నిమిత్తమే.
2 కొరింథీయులకు 11:21
మేము బలహీనులమై యున్నట్టు అవమానముగా మాటలాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైన ధైర్యము కలిగి యున్నాడో, ఆ విషయమందు నేనుకూడ ధైర్యము కలిగినవాడను; అవివేకముగా మాటలాడుచున్నానుసుమా.
2 కొరింథీయులకు 11:16
నేను అవివేకినని యెవడును తలంచవద్దని మరల చెప్పు చున్నాను. అట్లు తలంచినయెడల నేను కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టు గానే చేర్చు కొనుడి.
హెబ్రీయులకు 5:2
తానుకూడ బలహీనతచేత ఆవరింపబడియున్నందున అతడు ఏమియు తెలియనివారియెడలను త్రోవతప్పిన వారియెడలను తాలిమి చూపగలవాడై యున్నాడు.
2 కొరింథీయులకు 12:11
నేనవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీచేత మెప్పు పొందవలసినవాడను, ఏలయనగా నేను ఏమాత్రపువాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె నేను ఏ విషయములోను తక్కువ వాడను కాను.
1 కొరింథీయులకు 4:10
మేముక్రీస్తు నిమిత్తము వెఱ్ఱివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు; మేము బలహీనులము, మీరు బలవంతులు; మీరు ఘనులు, మేము ఘనహీనులము.
1 కొరింథీయులకు 4:8
ఇదివరకే మీరేమియు కొదువలేక తృప్తు లైతిరి, ఇది వరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి; అవును, మేమును మీతోకూడ రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే గదా?
1 కొరింథీయులకు 3:18
ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను.
1 కొరింథీయులకు 1:21
దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటన యను వెఱ్ఱి తనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయా పూర్వక సంకల్ప మాయెను.
అపొస్తలుల కార్యములు 26:29
అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక అనెను.
అపొస్తలుల కార్యములు 18:14
పౌలు నోరు తెరచి మాట లాడబోగా గల్లియోనుయూదులారా, యిదియొక అన్యాయము గాని చెడ్డ నేరము గాని యైనయెడల నేను మీమాట సహనముగా వినుట న్యాయమే.
మత్తయి సువార్త 17:17
అందుకు యేసువిశ్వాసములేని మూర్ఖతరమువారలారా, మీతో నేనెంత కాలము ఉందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొనిరండని చెప్పెను.
రాజులు రెండవ గ్రంథము 5:3
అదిషోమ్రో నులోనున్న ప్రవక్తదగ్గర నా యేలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను; అతడు నా యేలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయునని తన యజమానురాలితో అనెను.
యెహొషువ 7:7
అయ్యో, ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీ వెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివ సించుట మేలు.
సంఖ్యాకాండము 11:29
అందుకు మోషేనా నిమి త్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారిమీద ఉంచును గాక అని అతనితో అనెను.