లూకా సువార్త 2:9 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ లూకా సువార్త లూకా సువార్త 2 లూకా సువార్త 2:9

Luke 2:9
ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలి చెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి.

Luke 2:8Luke 2Luke 2:10

Luke 2:9 in Other Translations

King James Version (KJV)
And, lo, the angel of the Lord came upon them, and the glory of the Lord shone round about them: and they were sore afraid.

American Standard Version (ASV)
And an angel of the Lord stood by them, and the glory of the Lord shone round about them: and they were sore afraid.

Bible in Basic English (BBE)
And an angel of the Lord came to them, and the glory of the Lord was shining round about them: and fear came on them.

Darby English Bible (DBY)
And lo, an angel of [the] Lord was there by them, and [the] glory of [the] Lord shone around them, and they feared [with] great fear.

World English Bible (WEB)
Behold, an angel of the Lord stood by them, and the glory of the Lord shone around them, and they were terrified.

Young's Literal Translation (YLT)
and lo, a messenger of the Lord stood over them, and the glory of the Lord shone around them, and they feared a great fear.

And,
καὶkaikay
lo,
ἰδού,idouee-THOO
the
angel
ἄγγελοςangelosANG-gay-lose
of
the
Lord
κυρίουkyrioukyoo-REE-oo
upon
came
ἐπέστηepestēape-A-stay
them,
αὐτοῖςautoisaf-TOOS
and
καὶkaikay
the
glory
δόξαdoxaTHOH-ksa
Lord
the
of
κυρίουkyrioukyoo-REE-oo
shone
round
about
περιέλαμψενperielampsenpay-ree-A-lahm-psane
them:
αὐτούςautousaf-TOOS
and
καὶkaikay
they
were

ἐφοβήθησανephobēthēsanay-foh-VAY-thay-sahn
sore
φόβονphobonFOH-vone
afraid.
μέγανmeganMAY-gahn

Cross Reference

2 కొరింథీయులకు 3:18
మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము.

1 తిమోతికి 3:16
నిరా క్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెనుదేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.

లూకా సువార్త 1:28
ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచిదయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.

లూకా సువార్త 24:4
ఇందునుగూర్చి వారికేమియు తోచకయుండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలువబడిరి.

యోహాను సువార్త 12:41
యెషయా ఆయన మహిమను చూచినందున ఆయననుగూర్చి ఈ మాటలు చెప్పెను.

అపొస్తలుల కార్యములు 5:19
అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసికొని వచ్చిమీరు వెళ్లి దేవాలయములో నిలువబడి

అపొస్తలుల కార్యములు 12:7
ఇదిగో ప్రభువు దూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టిత్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతని చేతులనుండి ఊడిపడెను.

అపొస్తలుల కార్యములు 22:6
నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్నకాలమందు ఆకాశమునుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టు ప్రకాశించెను.

అపొస్తలుల కార్యములు 26:13
రాజా, మధ్యాహ్నమందు నా చుట్టును నాతోకూడ వచ్చినవారి చుట్టును ఆకాశమునుండి సూర్య తేజస్సుకంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని.

అపొస్తలుల కార్యములు 27:23
నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచిపౌలా, భయపడకుము;

2 కొరింథీయులకు 4:6
గనుక మేము మమ్మునుగూర్చి ప్రకటించు కొనుటలేదు గాని, క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభు వనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము.

ప్రకటన గ్రంథము 18:1
అటుతరువాత మహాధికారముగల వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమచేత భూమి ప్రకాశించెను.

లూకా సువార్త 1:11
ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కన బడగా

మత్తయి సువార్త 1:20
అతడు యీసంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది

నిర్గమకాండము 16:7
యెహోవామీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు; ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏపాటి వారము? మామీద సణుగనేల అనిరి.

నిర్గమకాండము 16:10
అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యమువైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను.

నిర్గమకాండము 40:34
అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను.

న్యాయాధిపతులు 6:11
యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవా షునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకివృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్లగొట్టుచుండగా

రాజులు మొదటి గ్రంథము 8:11
కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిర ములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువుచేత యాజ కులు సేవచేయుటకు నిలువలేక పోయిరి.

యెషయా గ్రంథము 6:3
వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.

యెషయా గ్రంథము 35:2
అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.

యెషయా గ్రంథము 40:5
యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

యెషయా గ్రంథము 60:1
నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.

యెహెజ్కేలు 3:23
​నేను లేచి మైదానపు భూమికి వెళ్లగా, కెబారునది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్ష మాయెను.

ప్రకటన గ్రంథము 20:11
మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.

హెబ్రీయులకు 12:21
మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషేనేను మిక్కిలి భయపడి వణకు చున్నాననెను.