కీర్తనల గ్రంథము 68:29 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 68 కీర్తనల గ్రంథము 68:29

Psalm 68:29
యెరూషలేములోని నీ ఆలయమునుబట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు.

Psalm 68:28Psalm 68Psalm 68:30

Psalm 68:29 in Other Translations

King James Version (KJV)
Because of thy temple at Jerusalem shall kings bring presents unto thee.

American Standard Version (ASV)
Because of thy temple at Jerusalem Kings shall bring presents unto thee.

Bible in Basic English (BBE)
Out of your Temple in Jerusalem.

Darby English Bible (DBY)
Because of thy temple at Jerusalem shall kings bring presents unto thee.

Webster's Bible (WBT)
Thy God hath commanded thy strength: strengthen, O God, that which thou hast wrought for us.

World English Bible (WEB)
Because of your temple at Jerusalem, Kings shall bring presents to you.

Young's Literal Translation (YLT)
Because of Thy temple at Jerusalem, To Thee do kings bring a present.

Because
of
thy
temple
מֵֽ֭הֵיכָלֶךָmēhêkālekāMAY-hay-ha-leh-ha
at
עַלʿalal
Jerusalem
יְרוּשָׁלִָ֑םyĕrûšālāimyeh-roo-sha-la-EEM
kings
shall
לְךָ֤lĕkāleh-HA
bring
יוֹבִ֖ילוּyôbîlûyoh-VEE-loo
presents
מְלָכִ֣יםmĕlākîmmeh-la-HEEM
unto
thee.
שָֽׁי׃šāyshai

Cross Reference

రాజులు మొదటి గ్రంథము 10:10
మరియు ఆమె రాజునకు రెండువందల నలువది మణుగుల బంగార మును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధ వర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు.

కీర్తనల గ్రంథము 76:11
మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టునున్నవారందరు భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను.

యెషయా గ్రంథము 60:16
యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమముగల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు.

యెషయా గ్రంథము 60:6
ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటె లును నీ దేశముమీద వ్యాపించును వారందరు షేబనుండి వచ్చెదరు బంగారమును ధూపద్రవ్యమును తీసికొనివచ్చెదరు యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు.

యెషయా గ్రంథము 18:7
ఆ కాలమున ఎత్తయినవారును నునుపైనచర్మముగల వారును. దూరములోనున్న భీకరమైనవారును నదులు పారు దేశము గలవారునైయున్న దౌష్టికులగు ఆ జనులు సైన్యములకధిపతియగు యెహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాసస్థలముగానుండు సీయోను పర్వతమునకు తేబడుదురు.

కీర్తనల గ్రంథము 72:10
తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించె దరు షేబరాజులును సెబారాజులును కానుకలు తీసికొని వచ్చెదరు.

కీర్తనల గ్రంథము 45:12
తూరు కుమార్తె నైవేద్యము తీసికొనివచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు.

నెహెమ్యా 2:8
​పట్టణప్రాకారమునకును, మందిరముతో సంబంధించిన కోటగుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని, దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగితిని; ఆలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తముకొలది రాజు నా మనవి ఆలకించెను.

ఎజ్రా 7:13
చేతనున్న నీ దేవుని ధర్మ శాస్త్రమును బట్టి యూదానుగూర్చియు యెరూషలేమునుగూర్చియు విమర్శచేయుటకు నీవు రాజుచేతను అతని యేడుగురు మంత్రులచేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయ మేమనగా,

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 32:33
హిజ్కియా తన పితరులతో కూడ నిద్రించగా జనులు దావీదు సంతతివారి శ్మశానభూమి యందు కట్టబడిన పైస్థానమునందు అతని పాతిపెట్టిరి. అతడు మరణ మొందినప్పుడు యూదావారందరును యెరూషలేము కాపురస్థులందరును అతనికి ఉత్తర క్రియ లను ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 32:23
అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి యిచ్చిరి. అందు వలన అతడు అప్పటినుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయెను.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 6:8
అయితే యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చిన దేమనగానా నామఘనతకొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన యుద్దేశము మంచిదే గాని

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 2:5
​నేనుకట్టించు మందిరము గొప్పదిగానుండును; మా దేవుడు సకలమైన దేవతలకంటె మహనీయుడు గనుక

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29:3
మరియు నా దేవుని మందిముమీద నాకు కలిగియున్న మక్కువచేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులు గాక, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28:10
పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22:7
మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెనునా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసికొనియుండగా

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17:4
నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము యెహోవా సెలవిచ్చునదేమనగా నా నివాస మునకై యొక ఆలయము కట్టించుట నీచేతకాదు.

రాజులు మొదటి గ్రంథము 10:24
అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరును అతని చూడగోరిరి.