నిర్గమకాండము 21:2
నీవు హెబ్రీయుడైన దాసుని కొనినయెడల వాడు ఆరు సంవత్సరములు దాసుడై యుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును.
If | כִּ֤י | kî | kee |
thou buy | תִקְנֶה֙ | tiqneh | teek-NEH |
an Hebrew | עֶ֣בֶד | ʿebed | EH-ved |
servant, | עִבְרִ֔י | ʿibrî | eev-REE |
six | שֵׁ֥שׁ | šēš | shaysh |
years | שָׁנִ֖ים | šānîm | sha-NEEM |
he shall serve: | יַֽעֲבֹ֑ד | yaʿăbōd | ya-uh-VODE |
seventh the in and | וּבַ֨שְּׁבִעִ֔ת | ûbaššĕbiʿit | oo-VA-sheh-vee-EET |
he shall go out | יֵצֵ֥א | yēṣēʾ | yay-TSAY |
free | לַֽחָפְשִׁ֖י | laḥopšî | la-hofe-SHEE |
for nothing. | חִנָּֽם׃ | ḥinnām | hee-NAHM |
Cross Reference
ద్వితీయోపదేశకాండమ 15:18
వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొన కూడదు. ఏలయనగా వాడు ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన రెండు జీత ముల లాభము నీకు కలిగెను. ఆలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయువాటన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించును.
ద్వితీయోపదేశకాండమ 15:12
నీ సహోదరులలో హెబ్రీయుడే గాని హెబ్రీయు రాలే గాని నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసినయెడల ఏడవ సంవత్సరమున వాని విడి పించి నీయొద్దనుండి పంపివేయవలెను.
యిర్మీయా 34:8
యూదులచేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములోనున్న హెబ్రీయులనుగాని హెబ్రీయు రాండ్రనుగాని అందరిని విడిపించునట్లు విడుదలచాటింప
నెహెమ్యా 5:8
అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తికొలది మేము విడిపించితివిు, మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా? అని వారితో చెప్పగా, వారు ఏమియు చెప్పలేక ఊరకుండిరి.
నెహెమ్యా 5:1
తమ సహోదరులైన యూదుల మీద జనులును వారి భార్యలును కఠినమైన ఫిర్యాదుచేసిరి.
1 కొరింథీయులకు 6:20
విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.
మత్తయి సువార్త 18:25
అప్పు తీర్చుటకు వానియొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమి్మ, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపిం చెను.
రాజులు రెండవ గ్రంథము 4:1
అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్యనీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవా యందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి యున్నాడని ఎలీషాకు మొఱ్ఱ పెట్టగా
ద్వితీయోపదేశకాండమ 31:10
వారితో ఇట్లనెనుప్రతి యేడవ సంవత్సరాంతమున, అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున
ద్వితీయోపదేశకాండమ 15:1
ఏడవ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను. ఆ గడువురీతి యేదనగా
లేవీయకాండము 25:39
నీయొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడినయెడల వానిచేత బానిససేవ చేయించుకొన కూడదు.
నిర్గమకాండము 22:3
సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టినయెడల వానికి రక్తాపరాధముండును; వాడు సరిగా సొమ్ము మరల చెల్లింపవలెను. వానికేమియు లేకపోయిన యెడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను.
నిర్గమకాండము 12:44
వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాని తినవచ్చును.
ఆదికాండము 27:36
ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది; అతడు నన్ను ఈ రెండు మారులు మోస పుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసికొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసికొనెనని చెప్పినాకొరకు మరి యే దీవెనయు మిగిల్చి యుంచలేదా అని అడిగెను.
ఆదికాండము 27:28
ఆకాశపుమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీ కనుగ్రహించుగాక