Ezekiel 22:2
నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా? దానికి నీవు తీర్పు తీర్చునెడల అదిచేయు హేయక్రియలన్నిటిని దానికి తెలియజేసి యీలాగున ప్రకటింపవలెను.
Ezekiel 22:2 in Other Translations
King James Version (KJV)
Now, thou son of man, wilt thou judge, wilt thou judge the bloody city? yea, thou shalt shew her all her abominations.
American Standard Version (ASV)
And thou, son of man, wilt thou judge, wilt thou judge the bloody city? then cause her to know all her abominations.
Bible in Basic English (BBE)
And you, son of man, will you be a judge, will you be a judge of the town of blood? then make clear to her all her disgusting ways.
Darby English Bible (DBY)
And thou, son of man, wilt thou judge, wilt thou judge the bloody city? Yea, cause her to know all her abominations,
World English Bible (WEB)
You, son of man, will you judge, will you judge the bloody city? then cause her to know all her abominations.
Young's Literal Translation (YLT)
`And thou, son of man, dost thou judge? dost thou judge the city of blood? then thou hast caused it to know all its abominations,
| Now, thou | וְאַתָּ֣ה | wĕʾattâ | veh-ah-TA |
| son | בֶן | ben | ven |
| of man, | אָדָ֔ם | ʾādām | ah-DAHM |
| judge, thou wilt | הֲתִשְׁפֹּ֥ט | hătišpōṭ | huh-teesh-POTE |
| wilt thou judge | הֲתִשְׁפֹּ֖ט | hătišpōṭ | huh-teesh-POTE |
| אֶת | ʾet | et | |
| bloody the | עִ֣יר | ʿîr | eer |
| city? | הַדָּמִ֑ים | haddāmîm | ha-da-MEEM |
| shew shalt thou yea, | וְה֣וֹדַעְתָּ֔הּ | wĕhôdaʿtāh | veh-HOH-da-TA |
| her | אֵ֖ת | ʾēt | ate |
| all | כָּל | kāl | kahl |
| her abominations. | תּוֹעֲבוֹתֶֽיהָ׃ | tôʿăbôtêhā | toh-uh-voh-TAY-ha |
Cross Reference
నహూము 3:1
నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ; అది ఎడ తెగక యెర పట్టుకొనుచు మోసముతోను బలాత్కా రముతోను నిండియున్నది.
యెహెజ్కేలు 24:9
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, నేనును విస్తరించి కట్టెలు పేర్చబోవుచున్నాను.
యెహెజ్కేలు 24:6
కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగానరహంతకులున్న పట్టణమునకు శ్రమ; మడ్డిగల కుండా, మానకుండ మడ్డిగలిగియుండు కుండా, నీకు శ్రమ; చీటి దాని వంతున పడలేదు, వండినదానిని ముక్కవెంబడి ముక్కగా దానిలోనుండి తీసికొని రమ్ము.
1 తిమోతికి 5:20
ఇతరులు భయపడునిమిత్తము పాపము చేయువారిని అందరియెదుట గద్దింపుము.
అపొస్తలుల కార్యములు 7:52
మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి.
మత్తయి సువార్త 27:25
అందుకు ప్రజ లందరువాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి.
హొషేయ 4:2
అబద్ధసాక్ష్యము పలు కుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగి లించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యెను; జనులు కన్నము వేసెదరు, మానక నరహత్యచేసెదరు.
యెహెజ్కేలు 20:4
వారికి న్యాయము తీర్చు దువా? నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన హేయకృత్యములను వారికి తెలియ జేయుము.
యెషయా గ్రంథము 58:1
తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియ జేయుము యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియ జేయుము
రాజులు రెండవ గ్రంథము 21:16
మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడతనడిచి, యూదా వారిని పాపములో దింపినదిగాక యెరూషలేమును ఈ కొననుండి ఆ కొనవరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను.
లూకా సువార్త 11:50
వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు.
మత్తయి సువార్త 23:35
నీతిమంతు డైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవా లయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతి మంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును.
యెహెజ్కేలు 23:1
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై... యీలాగు సెలవిచ్చెను
యెహెజ్కేలు 16:1
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
యెహెజ్కేలు 8:9
నీవు లోపలికి చొచ్చి, యిక్కడ వారెట్టి హేయకృత్యములు చేయు చున్నారో చూడుమని ఆయన నాకు సెలవియ్యగా
యిర్మీయా 2:34
మరియు నిర్ధోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగులమీద కనబడుచున్నది; కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటిమీదను కనబడు చున్నది.
యిర్మీయా 2:30
నేను మీ పిల్లలను హతముచేయుట వ్యర్థమే; వారు శిక్షకు లోబడరు; నాశనవాంఛగల సింహమువలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించు చున్నది.
రాజులు రెండవ గ్రంథము 24:3
మనష్షే చేసిన క్రియలన్నిటిని బట్టియు, అతడు నిరపరాధులను హతముచేయుటను బట్టియు, యూదావారు యెహోవా సముఖమునుండి పారదోలబడునట్లుగా ఆయన ఆజ్ఞవలన ఇది వారిమీదికి వచ్చెను.