ఎజ్రా 10:2
ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెనుమేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లిచేసికొని మా దేవుని దృష్టికి పాపము చేసితివిు; అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు.
And Shechaniah | וַיַּעַן֩ | wayyaʿan | va-ya-AN |
the son | שְׁכַנְיָ֨ה | šĕkanyâ | sheh-hahn-YA |
Jehiel, of | בֶן | ben | ven |
one of the sons | יְחִיאֵ֜ל | yĕḥîʾēl | yeh-hee-ALE |
Elam, of | מִבְּנֵ֤י | mibbĕnê | mee-beh-NAY |
answered | עֵולָם֙ | ʿēwlām | ave-LAHM |
and said | וַיֹּ֣אמֶר | wayyōʾmer | va-YOH-mer |
Ezra, unto | לְעֶזְרָ֔א | lĕʿezrāʾ | leh-ez-RA |
We | אֲנַ֙חְנוּ֙ | ʾănaḥnû | uh-NAHK-NOO |
have trespassed | מָעַ֣לְנוּ | māʿalnû | ma-AL-noo |
God, our against | בֵֽאלֹהֵ֔ינוּ | bēʾlōhênû | vay-loh-HAY-noo |
and have taken | וַנֹּ֛שֶׁב | wannōšeb | va-NOH-shev |
strange | נָשִׁ֥ים | nāšîm | na-SHEEM |
wives | נָכְרִיּ֖וֹת | nokriyyôt | noke-REE-yote |
of the people | מֵֽעַמֵּ֣י | mēʿammê | may-ah-MAY |
land: the of | הָאָ֑רֶץ | hāʾāreṣ | ha-AH-rets |
yet now | וְעַתָּ֛ה | wĕʿattâ | veh-ah-TA |
there is | יֵשׁ | yēš | yaysh |
hope | מִקְוֶ֥ה | miqwe | meek-VEH |
in Israel | לְיִשְׂרָאֵ֖ל | lĕyiśrāʾēl | leh-yees-ra-ALE |
concerning | עַל | ʿal | al |
this | זֹֽאת׃ | zōt | zote |
Cross Reference
నెహెమ్యా 13:27
కాగా ఇంత గొప్పకీడు చేయునట్లును, మన దేవునికి విరోధముగా పాపము చేయు నట్లును అన్యస్త్రీలను వివాహము చేసికొనిన మీవంటివారి మాటలను మేము ఆలకింపవచ్చునా? అని అడిగితిని.
ఎజ్రా 9:2
వారి కుమార్తెలను పెండ్లి చేసికొనుచు, తమ కుమారులకును తీసికొనుచు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనినవారైరి. ఈ అపరాధము చేసినవారిలో పెద్దలును అధికారులును నిజముగా ముఖ్యులై యుండిరని చెప్పిరి.
1 యోహాను 1:7
అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి ఎ
యాకోబు 2:9
మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమువలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.
యిర్మీయా 3:12
నీవు వెళ్లి ఉత్తరదిక్కున ఈ మాటలు ప్రక టింపుముద్రోహినివగు ఇశ్రాయేలూ, తిరిగిరమ్ము; ఇదే యెహోవా వాక్కు. మీమీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడు కోపించువాడను కాను; ఇదే యెహోవా వాక్కు.
యెషయా గ్రంథము 55:6
యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు కొనుడి.
నెహెమ్యా 3:29
వారిని ఆనుకొని తన యింటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేసెను; అతని ఆను కొని తూర్పు ద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షెమయా బాగుచేసెను.
ఎజ్రా 10:26
ఏలాము వంశములో మత్తన్యా జెకర్యా యెహీయేలు అబ్దీ యెరేమోతు ఏలీయ్యా.
నిర్గమకాండము 34:12
నీవు ఎక్కడికి వెళ్లుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసికొనకుండ జాగ్రత్తపడుము. ఒకవేళ అది నీకు ఉరికావచ్చును.
నిర్గమకాండము 34:6
అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచుయెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా.
నెహెమ్యా 7:34
రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును
నెహెమ్యా 7:12
ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును.
ఎజ్రా 2:31
ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,
ఎజ్రా 2:7
ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,