Jeremiah 50:38
నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములుగల దేశము జనులు భీకరప్రతిమలనుబట్టి పిచ్చిచేష్టలు చేయుదురు.
Jeremiah 50:38 in Other Translations
King James Version (KJV)
A drought is upon her waters; and they shall be dried up: for it is the land of graven images, and they are mad upon their idols.
American Standard Version (ASV)
A drought is upon her waters, and they shall be dried up; for it is a land of graven images, and they are mad over idols.
Bible in Basic English (BBE)
A sword is on her waters, drying them up; for it is a land of images, and their minds are fixed on false gods.
Darby English Bible (DBY)
a drought is upon her waters, and they shall be dried up; for it is a land of graven images, and they are mad after frightful idols.
World English Bible (WEB)
A drought is on her waters, and they shall be dried up; for it is a land of engraved images, and they are mad over idols.
Young's Literal Translation (YLT)
A sword `is' on her waters, and they have been dried up, For it `is' a land of graven images, And in idols they do boast themselves.
| A drought | חֹ֥רֶב | ḥōreb | HOH-rev |
| is upon | אֶל | ʾel | el |
| her waters; | מֵימֶ֖יהָ | mêmêhā | may-MAY-ha |
| up: dried be shall they and | וְיָבֵ֑שׁוּ | wĕyābēšû | veh-ya-VAY-shoo |
| for | כִּ֣י | kî | kee |
| land the is it | אֶ֤רֶץ | ʾereṣ | EH-rets |
| of graven images, | פְּסִלִים֙ | pĕsilîm | peh-see-LEEM |
| they and | הִ֔יא | hîʾ | hee |
| are mad | וּבָאֵימִ֖ים | ûbāʾêmîm | oo-va-ay-MEEM |
| upon their idols. | יִתְהֹלָֽלוּ׃ | yithōlālû | yeet-hoh-la-LOO |
Cross Reference
యిర్మీయా 50:2
జనములలో ప్రకటించుడి సమాచారము తెలియ జేయుడి ధ్వజమునెత్తి మరుగుచేయక చాటించుడి బబులోను పట్టబడును బేలు అవమానము నొందును మెరోదకు నేల పడవేయబడును బబులోను విగ్రహములు అవమానము నొందును దాని బొమ్మలు బోర్లద్రోయబడును
యెషయా గ్రంథము 44:27
నేనే నీ నదులను ఎండచేయుచున్నాను ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను
ప్రకటన గ్రంథము 16:12
ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానదిమీద కుమ్మరింపగా తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు యెండి పోయెను.
యిర్మీయా 51:52
ఇదే యెహోవా వాక్కు. రాబోవు దినములలో నేను బబులోనుయొక్క విగ్రహములను శిక్షింతును ఆమె దేశమందంతటను గాయపరచబడినవారు మూల్గు దురు.
యిర్మీయా 51:47
రాబోవు దినములలో నేను బబులోనుయొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును దాని దేశమంతయు అవమానము నొందును జనులు హతులై దాని మధ్యను కూలెదరు
ప్రకటన గ్రంథము 17:15
మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెనుఆ వేశ్య కూర్చున్నచోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జన ములను, ఆ యా భాషలు మాటలాడువారిని సూచించును.
ప్రకటన గ్రంథము 17:5
దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడియుండెనుమర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహా బబులోను.
అపొస్తలుల కార్యములు 17:16
పౌలు ఏథెన్సులో వారికొరకు కనిపెట్టుకొని యుండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను.
హబక్కూకు 2:18
చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుటవలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించినదానియందు నమి్మక యుంచుటవలన ప్రయోజన మేమి? అబద్ధములు బోధించు పోతవిగ్రహములయందు నమి్మక యుంచుటవలన ప్రయోజనమేమి?
దానియేలు 5:4
వారు బంగారు వెండి యిత్తడి యినుము కఱ్ఱ రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా
దానియేలు 3:1
రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమయొకటి చేయించి, బబులోనుదేశములోని దూరాయను మైదాన ములో దాని నిలువబెట్టించెను. అది అరువదిమూరల ఎత్తును ఆరుమూరల వెడల్పునై యుండెను.
యిర్మీయా 51:44
బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను వాడు మింగినదానిని వానినోటనుండి కక్కించు చున్నాను ఇకమీదట జనములు వానియొద్దకు సమూహములుగా కూడి రావు బబులోను ప్రాకారము కూలును;
యిర్మీయా 51:32
దాని యోధులు దిగులుపడిరి అని బంట్రౌతు వెంబడి బంట్రౌతును దూతవెంబడి దూతయు పరుగెత్తుచు బబులోను రాజు నకు తెలియజేతురు. దాని రేవులు శత్రువశమాయెను.
యిర్మీయా 51:7
బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారుపాత్రయై యుండెను. దానిచేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి యున్నారు.
యిర్మీయా 50:12
మీ తల్లి బహుగా సిగ్గుపడును మిమ్మును కన్నది తెల్ల బోవును ఇదిగో అది జనములన్నిటిలో అతినీచ జనమగును అది యెడారియు ఎండినభూమియు అడవియు నగును.
యెషయా గ్రంథము 46:1
బేలు కూలుచున్నది నెబో క్రుంగుచున్నది వాటి ప్రతిమలు జంతువులమీదను పశువులమీదను మోయబడుచున్నవి
యెషయా గ్రంథము 44:25
నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయు వాడను సోదెకాండ్రను వెఱ్ఱివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే.