John 8:37
మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును; అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు.
John 8:37 in Other Translations
King James Version (KJV)
I know that ye are Abraham's seed; but ye seek to kill me, because my word hath no place in you.
American Standard Version (ASV)
I know that ye are Abraham's seed: yet ye seek to kill me, because my word hath not free course in you.
Bible in Basic English (BBE)
I am conscious that you are Abraham's seed; but you have a desire to put me to death because my word has no place in you.
Darby English Bible (DBY)
I know that ye are Abraham's seed; but ye seek to kill me, because my word has no entrance in you.
World English Bible (WEB)
I know that you are Abraham's seed, yet you seek to kill me, because my word finds no place in you.
Young's Literal Translation (YLT)
`I have known that ye are seed of Abraham, but ye seek to kill me, because my word hath no place in you;
| I know | οἶδα | oida | OO-tha |
| that | ὅτι | hoti | OH-tee |
| ye are | σπέρμα | sperma | SPARE-ma |
| Abraham's | Ἀβραάμ | abraam | ah-vra-AM |
| seed; | ἐστε· | este | ay-stay |
| but | ἀλλὰ | alla | al-LA |
| ye seek | ζητεῖτέ | zēteite | zay-TEE-TAY |
| to kill | με | me | may |
| me, | ἀποκτεῖναι | apokteinai | ah-poke-TEE-nay |
| because | ὅτι | hoti | OH-tee |
| ὁ | ho | oh | |
| my | λόγος | logos | LOH-gose |
| word hath | ὁ | ho | oh |
| ἐμὸς | emos | ay-MOSE | |
| no | οὐ | ou | oo |
| place | χωρεῖ | chōrei | hoh-REE |
| in | ἐν | en | ane |
| you. | ὑμῖν | hymin | yoo-MEEN |
Cross Reference
యోహాను సువార్త 7:1
అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకి నందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను.
1 కొరింథీయులకు 2:14
ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయ ములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.
రోమీయులకు 9:7
అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు గానిఇస్సాకువల్లనైనది నీ సంతానము అనబడును,
అపొస్తలుల కార్యములు 13:26
సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, యీ రక్షణ వాక్యము మనయొద్దకు పంపబడియున్నది.
యోహాను సువార్త 12:39
ఇందుచేత వారు నమ్మలేక పోయిరి, ఏలయనగా
యోహాను సువార్త 11:53
కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలో చించుచుండిరి.
యోహాను సువార్త 10:31
యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లుచేత పట్టుకొనగా
యోహాను సువార్త 8:59
కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను.
యోహాను సువార్త 8:45
నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు.
యోహాను సువార్త 8:43
మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుటవలననేగదా?
యోహాను సువార్త 8:39
అందుకు వారు ఆయనతోమా తండ్రి అబ్రాహామనిరి; యేసుమీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు.
యోహాను సువార్త 8:33
వారుమేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయ బడుదురని యేల చెప్పుచున్నావని ఆయనతో అనిరి.
యోహాను సువార్త 8:6
ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను.
యోహాను సువార్త 7:25
యెరూషలేమువారిలో కొందరువారు చంప వెదకు వాడు ఈయనే కాడా?
యోహాను సువార్త 7:19
మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్ర మును గైకొనడు; మీరెందుకు నన్ను చంప జూచుచున్నారని వారితో చెప్పెను.
యోహాను సువార్త 5:44
అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పునుకోరక యొకనివలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు? నేను తండ్రియొద్ద మీమీద నేరము మోపుదునని తలంచకుడి;
యోహాను సువార్త 5:16
ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి.
మత్తయి సువార్త 13:15
గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెర వేరుచున్నది.
మత్తయి సువార్త 13:19
ఎవడైనను రాజ్య మునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే.