Mark 15:14
అందుకు పిలాతుఎందుకు? అతడే చెడుకార్యము చేసె నని వారి నడుగగా వారువానిని సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.
Mark 15:14 in Other Translations
King James Version (KJV)
Then Pilate said unto them, Why, what evil hath he done? And they cried out the more exceedingly, Crucify him.
American Standard Version (ASV)
And Pilate said unto them, Why, what evil hath he done? But they cried out exceedingly, Crucify him.
Bible in Basic English (BBE)
And Pilate said to them, Why, what evil has he done? But their cry was the louder, To the cross!
Darby English Bible (DBY)
And Pilate said to them, What evil then has he done? But they cried out the more urgently, Crucify him.
World English Bible (WEB)
Pilate said to them, "Why, what evil has he done?" But they cried out exceedingly, "Crucify him!"
Young's Literal Translation (YLT)
And Pilate said to them, `Why -- what evil did he?' and they cried out the more vehemently, `Crucify him;'
| ὁ | ho | oh | |
| Then | δὲ | de | thay |
| Pilate | Πιλᾶτος | pilatos | pee-LA-tose |
| said | ἔλεγεν | elegen | A-lay-gane |
| them, unto | αὐτοῖς | autois | af-TOOS |
| Why, | Τί | ti | tee |
| what | γὰρ | gar | gahr |
| evil | κακόν | kakon | ka-KONE |
| done? he hath | ἐποίησεν | epoiēsen | ay-POO-ay-sane |
| And | οἱ | hoi | oo |
| they | δὲ | de | thay |
| cried out | περισσοτέρως | perissoterōs | pay-rees-soh-TAY-rose |
| exceedingly, more the | ἔκραξαν | ekraxan | A-kra-ksahn |
| Crucify | Σταύρωσον | staurōson | STA-roh-sone |
| him. | αὐτόν | auton | af-TONE |
Cross Reference
లూకా సువార్త 23:41
మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందు చున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి
యోహాను సువార్త 18:38
అందుకు పిలాతుసత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు;
యోహాను సువార్త 19:6
ప్రధాన యాజకులును బంట్రౌతులును ఆయనను చూచిసిలువవేయుము సిలువవేయుము అని కేకలువేయగా పిలాతుఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువవేయుడని వారితో చెప్పెను.
యోహాను సువార్త 19:12
ఈ మాటనుబట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నముచేసెను గాని యూదులునీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలువేసిరి.
అపొస్తలుల కార్యములు 7:54
వారీ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లుకొరికిరి.
అపొస్తలుల కార్యములు 19:34
అయితే అతడు యూదుడని వారు తెలిసికొనినప్పుడు అందరును ఏకశబ్దముతో రెండు గంటలసేపుఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి.
అపొస్తలుల కార్యములు 22:22
ఈ మాటవరకు అతడు చెప్పినది వారు ఆలకించు చుండిరి. అప్పడు ఇటువంటివాడు బ్రదుకతగడు, భూమిమీద ఉండకుండ వానిని చంపివేయుడని కేకలు వేసిరి.
హెబ్రీయులకు 7:26
పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపు లలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.
1 పేతురు 1:19
అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా
లూకా సువార్త 23:47
శతాధిపతి జరిగినది చూచిఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను.
లూకా సువార్త 23:23
అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలువేసి, వీనిని సిలువవేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను.
లూకా సువార్త 23:21
వారు వీనిని సిలువవేయుము సిలువవేయుము అని కేకలు వేసిరి.
యెషయా గ్రంథము 53:3
అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు.
యెషయా గ్రంథము 53:9
అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు.
మత్తయి సువార్త 27:4
నేను నిరపరాధరక్తమును1 అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారుదానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా
మత్తయి సువార్త 27:19
అతడు న్యాయపీఠముమీద కూర్చుండియున్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు; ఈ ప్రొద్దు ఆయ ననుగూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము
మత్తయి సువార్త 27:23
అధిపతిఎందుకు? ఇతడు ఏ దుష్కా ర్యము చేసెనని అడుగగా వారుసిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.
మత్తయి సువార్త 27:54
శతాధి పతియు అతనితో కూడ యేసునకు కావలి యున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, మిక్కిలి భయపడినిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పు కొనిరి.
లూకా సువార్త 23:4
పిలాతు ప్రధాన యాజకులతోను జనసమూహములతోనుఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేద నెను.
లూకా సువార్త 23:14
ప్రజలు తిరుగబడునట్లు చేయు చున్నాడని మీరీమనుష్యుని నాయొద్దకు తెచ్చి తిరే. ఇదిగో నేను మీయెదుట ఇతనిని విమర్శింపగా మీ రితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడ
కీర్తనల గ్రంథము 69:4
నిర్నిమిత్తముగా నామీద పగపట్టువారు నా తలవెండ్రుకలకంటె విస్తారముగా ఉన్నారు అబద్ధమునుబట్టి నాకుశత్రువులై నన్ను సంహరింప గోరువారు అనేకులు నేను దోచుకొననిదానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను.