సామెతలు 13:17 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ సామెతలు సామెతలు 13 సామెతలు 13:17

Proverbs 13:17
దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధమువంటివాడు.

Proverbs 13:16Proverbs 13Proverbs 13:18

Proverbs 13:17 in Other Translations

King James Version (KJV)
A wicked messenger falleth into mischief: but a faithful ambassador is health.

American Standard Version (ASV)
A wicked messenger falleth into evil; But a faithful ambassador is health.

Bible in Basic English (BBE)
A man taking false news is a cause of trouble, but he who gives news rightly makes things well.

Darby English Bible (DBY)
A wicked messenger falleth into evil; but a faithful ambassador is health.

World English Bible (WEB)
A wicked messenger falls into trouble, But a trustworthy envoy gains healing.

Young's Literal Translation (YLT)
A wicked messenger falleth into evil, And a faithful ambassador is healing.

A
wicked
מַלְאָ֣ךְmalʾākmahl-AK
messenger
רָ֭שָׁעrāšoʿRA-shoh
falleth
יִפֹּ֣לyippōlyee-POLE
into
mischief:
בְּרָ֑עbĕrāʿbeh-RA
faithful
a
but
וְצִ֖ירwĕṣîrveh-TSEER
ambassador
אֱמוּנִ֣יםʾĕmûnîmay-moo-NEEM
is
health.
מַרְפֵּֽא׃marpēʾmahr-PAY

Cross Reference

సామెతలు 25:13
నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనమువంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల జేయును.

2 తిమోతికి 2:2
నీవు అనేక సాక్షులయెదుట నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము,

1 తిమోతికి 1:12
​పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు,

2 కొరింథీయులకు 5:20
కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమైదేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.

2 కొరింథీయులకు 2:17
కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యముగలవారమును దేవునివలన నియమింపబడిన వారమునైయుండి, క్రీస్తునందు దేవునియెదుట బోధించు చున్నాము.

1 కొరింథీయులకు 4:2
మరియు గృహనిర్వా హకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము.

యెహెజ్కేలు 33:7
నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించియున్నాను గనుక నీవు నా నోటిమాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను.

యెహెజ్కేలు 3:18
అవశ్యముగా నీవు మరణ మవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించునట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు నుండినయెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమునుబట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును.

యిర్మీయా 23:28
కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను; నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమునుబట్టి నా మాట చెప్పవలెను; ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు.

యిర్మీయా 23:13
షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని; వారు బయలు పేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి.

సామెతలు 26:6
మూర్ఖునిచేత వర్తమానము పంపువాడు కాళ్లు తెగగొట్టుకొని విషము త్రాగినవానితో సమా నుడు.

సామెతలు 25:23
ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును.

సామెతలు 10:26
సోమరి తనను పని పెట్టువారికి పండ్లకు పులుసువంటివాడు కండ్లకు పొగవంటివాడు.