Proverbs 27:23
నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసికొనుము నీ మందలయందు మనస్సు ఉంచుము.
Proverbs 27:23 in Other Translations
King James Version (KJV)
Be thou diligent to know the state of thy flocks, and look well to thy herds.
American Standard Version (ASV)
Be thou diligent to know the state of thy flocks, `And' look well to thy herds:
Bible in Basic English (BBE)
Take care to have knowledge about the condition of your flocks, looking well after your herds;
Darby English Bible (DBY)
Be well acquainted with the appearance of thy flocks; look well to thy herds:
World English Bible (WEB)
Know well the state of your flocks, And pay attention to your herds:
Young's Literal Translation (YLT)
Know well the face of thy flock, Set thy heart to the droves,
| Be thou diligent | יָדֹ֣עַ | yādōaʿ | ya-DOH-ah |
| to know | תֵּ֭דַע | tēdaʿ | TAY-da |
| the state | פְּנֵ֣י | pĕnê | peh-NAY |
| flocks, thy of | צֹאנֶ֑ךָ | ṣōʾnekā | tsoh-NEH-ha |
| and look | שִׁ֥ית | šît | sheet |
| well | לִ֝בְּךָ֗ | libbĕkā | LEE-beh-HA |
| to thy herds. | לַעֲדָרִֽים׃ | laʿădārîm | la-uh-da-REEM |
Cross Reference
1 పేతురు 5:2
బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభా పేక్షతోకాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి.
యోహాను సువార్త 21:15
వారు భోజనముచేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచియెహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసునా గొఱ్ఱ పిల్లలను మేపుమని అతనితో చెప్పెను.
యోహాను సువార్త 10:3
అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడి పించును.
యెహెజ్కేలు 34:31
నా గొఱ్ఱలును నేను మేపుచున్న గొఱ్ఱలు నగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను; ఇదే ప్రభు వైన యెహోవా వాక్కు.
యెహెజ్కేలు 34:22
నా గొఱ్ఱలు ఇక దోపుడు కాకుండ గొఱ్ఱ కును గొఱ్ఱకును మధ్య తీర్పుతీర్చి నేను వాటిని రక్షించె దను.
సామెతలు 24:32
నేను దాని చూచి యోచన చేసికొంటిని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 26:10
అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్షగలవాడు గనుక పర్వత ములలోను కర్మెలులోను అతనికి వ్యవసాయకులును ద్రాక్ష తోట పనివారును కలిగియుండిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 27:29
షారోనులో మేయు పశువులమీద షారోనీయుడైన షిట్రయియు, లోయలలోని పశువులమీద అద్లయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి.
సమూయేలు మొదటి గ్రంథము 17:28
అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్న యగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితోనీవిక్కడి కెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱ మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితి వనెను.
ద్వితీయోపదేశకాండమ 32:46
మరల వారితో ఇట్లనెనుమీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటిని మీ మన స్సులలో పెట్టుకొని, మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనవలెనని వారి కాజ్ఞాపింపవలెను.
నిర్గమకాండము 7:23
జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన యింటికి వెళ్లెను.
ఆదికాండము 33:13
అతడునాయొద్ద నున్న పిల్లలు పసిపిల్ల లనియు, గొఱ్ఱలు మేకలు పశువులు పాలిచ్చునవి అనియు నా ప్రభువుకు తెలియును. ఒక్కదినమే వాటిని వడిగా తోలినయెడల ఈ మంద అంతయు చచ్చును.
ఆదికాండము 31:38
ఈ యిరువది యేండ్లు నేను నీయొద్దనుంటిని. నీ గొఱ్ఱలైనను మేక లైనను ఈచు కొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు.