Index
Full Screen ?
 

కీర్తనల గ్రంథము 102:14

Psalm 102:14 in Tamil తెలుగు బైబిల్ కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 102

కీర్తనల గ్రంథము 102:14
దాని రాళ్లు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని కనికరించుదురు

For
כִּֽיkee
thy
servants
רָצ֣וּrāṣûra-TSOO
take
pleasure
in
עֲ֭בָדֶיךָʿăbādêkāUH-va-day-ha

אֶתʾetet
stones,
her
אֲבָנֶ֑יהָʾăbānêhāuh-va-NAY-ha
and
favour
וְֽאֶתwĕʾetVEH-et
the
dust
עֲפָרָ֥הּʿăpārāhuh-fa-RA
thereof.
יְחֹנֵֽנוּ׃yĕḥōnēnûyeh-hoh-nay-NOO

Cross Reference

నెహెమ్యా 4:2
షోమ్రోను దండువారి యెదుటను తన స్నేహితుల యెదు టను ఇట్లనెనుదుర్బలులైన యీ యూదులు ఏమి చేయు దురు? తమంతట తామే యీ పని ముగింతురా? బలులు అర్పించి బలపరచుకొందురా?ఒక దినమందే ముగింతురా?కాల్చబడిన చెత్తను కుప్పలుగాపడిన రాళ్లను మరల బల మైనవిగా చేయుదురా?

దానియేలు 9:16
ప్రభువా, మా పాపములనుబట్టియు మా పితరుల దోష మునుబట్టియు, యెరూషలేము నీ జనులచుట్టునున్న సకల ప్రజలయెదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము; ఆ పట్టణముమీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతికార్యము లన్నిటినిబట్టి విజ్ఞాపనము చేసికొనుచున్నాను.

కీర్తనల గ్రంథము 137:5
యెరూషలేమా, నేను నిన్ను మరచినయెడల నా కుడిచేయి తన నేర్పు మరచును గాక.

కీర్తనల గ్రంథము 79:7
వారు యాకోబు సంతతిని మింగివేసియున్నారు వారి నివాసమును పాడుచేసియున్నారు

కీర్తనల గ్రంథము 79:1
దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి యున్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచి యున్నారు యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసియున్నారు.

నెహెమ్యా 4:10
అప్పుడు యూదావారుబరువులు మోయువారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేమని చెప్పగా,

నెహెమ్యా 4:6
అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగియుండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి యుండెను.

నెహెమ్యా 2:17
అయితే వారితో నేనిట్లంటినిమనకు కలిగిన శ్రమ మీకు తెలిసియున్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయెనో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచియున్నారు, మనకు ఇకమీదట నింద రాకుండ యెరూషలేముయొక్క ప్రాకారమును మరల కట్టుదము రండి.

నెహెమ్యా 2:3
​నేను మిగుల భయపడిరాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి, దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడి యుండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని.

నెహెమ్యా 1:3
వారుచెరపట్టబడినవారిలో శేషించినవారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు; మరియు యెరూ షలేముయొక్క ప్రాకారము పడద్రోయబడినది; దాని గుమ్మములును అగ్నిచేత కాల్చ బడినవని నాతో చెప్పిరి.

ఎజ్రా 7:27
యెరూషలేములోనుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను,రాజును అతని మంత్రులును రాజుయొక్క మహాధిపతులును నాకు దయ అనుగ్రహింపజేసినందునను, మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక.

ఎజ్రా 3:1
ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణము లకు వచ్చిన తరువాత జనులు ఏకమనస్సు కలిగినవారై యెరూషలేములో కూడి,

ఎజ్రా 1:5
అప్పుడు యూదా పెద్దలును, బెన్యామీనీయుల పెద్దలును, యాజకులును లేవీయులును ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరు వారితో కూడుకొని వచ్చి, యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి.

Chords Index for Keyboard Guitar