కీర్తనల గ్రంథము 102:3
పొగ యెగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవు చున్నవి పొయిలోనిది కాలిపోయినట్లు నా యెముకలు కాలి పోయి యున్నవి.
For | כִּֽי | kî | kee |
my days | כָל֣וּ | kālû | ha-LOO |
are consumed | בְעָשָׁ֣ן | bĕʿāšān | veh-ah-SHAHN |
like smoke, | יָמָ֑י | yāmāy | ya-MAI |
bones my and | וְ֝עַצְמוֹתַ֗י | wĕʿaṣmôtay | VEH-ats-moh-TAI |
are burned | כְּמוֹקֵ֥ד | kĕmôqēd | keh-moh-KADE |
as | נִחָֽרוּ׃ | niḥārû | nee-ha-ROO |
Cross Reference
యాకోబు 4:14
రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.
యోబు గ్రంథము 30:30
నా చర్మము నల్లబడి నామీదనుండి ఊడిపోవుచున్నది కాకవలన నా యెముకలు కాగిపోయెను.
కీర్తనల గ్రంథము 37:20
భక్తిహీనులు నశించిపోవుదురు యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలి యుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలె కనబడకపోవుదురు.
విలాపవాక్యములు 1:13
పరమునుండి ఆయన నా యెముకలమీదికి అగ్ని ప్రయోగించి యున్నాడు అది యెడతెగక వాటిని కాల్చుచున్నది నా పాదములను చిక్కు పరచుటకై వలనొగ్గి యున్నాడు నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు ఆయన నన్ను పాడుచేసి దినమెల్ల నన్ను సొమ్మసిల్ల జేసియున్నాడు.
కీర్తనల గ్రంథము 31:10
నా బ్రదుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా యేండ్లు గతించు చున్నవి నా దోషమునుబట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా యెముకలు క్షీణించుచున్నవి.
కీర్తనల గ్రంథము 22:14
నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవినా హృదయము నా అంతరంగమందు మైనమువలెకరగియున్నది.
కీర్తనల గ్రంథము 38:3
నీ కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు.
కీర్తనల గ్రంథము 119:83
నేను పొగ తగులుచున్న సిద్దెవలెనైతిని అయినను నీ కట్టడలను నేను మరచుట లేదు.
విలాపవాక్యములు 3:4
ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింప జేయుచున్నాడు. నా యెముకలను విరుగగొట్టుచున్నాడు