కీర్తనల గ్రంథము 119:112
నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొనియున్నాను ఇది తుదవరకు నిలుచు నిత్యనిర్ణయము.
I have inclined | נָטִ֣יתִי | nāṭîtî | na-TEE-tee |
mine heart | לִ֭בִּי | libbî | LEE-bee |
to perform | לַעֲשׂ֥וֹת | laʿăśôt | la-uh-SOTE |
statutes thy | חֻקֶּ֗יךָ | ḥuqqêkā | hoo-KAY-ha |
alway, | לְעוֹלָ֥ם | lĕʿôlām | leh-oh-LAHM |
even unto the end. | עֵֽקֶב׃ | ʿēqeb | A-kev |
Cross Reference
కీర్తనల గ్రంథము 119:33
(హే) యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును.
కీర్తనల గ్రంథము 119:36
లోభముతట్టు కాక నీ శాసనములతట్టు నా హృద యము త్రిప్పుము.
ప్రకటన గ్రంథము 2:10
ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదను.
కీర్తనల గ్రంథము 141:4
పాపము చేయువారితో కూడ నేను దుర్నీతికార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనియ్యకుము వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 19:3
అయితే దేశములోనుండి నీవు దేవతాస్తంభములను తీసివేసి దేవునియొద్ద విచారణచేయుటకు నీవు మనస్సు నిలుపుకొనియున్నావు, నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి.
రాజులు మొదటి గ్రంథము 8:58
తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లుగాను, తాను మన పిత రులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనునట్లుగాను, మన హృదయములను తనతట్టు త్రిప్పుకొనును గాక.
యెహొషువ 24:23
అందుకతడుఆలాగైతే మీ మధ్య నున్న అన్యదేవతలను తొలగద్రోసి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను.
1 పేతురు 1:13
కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బర మైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపవిషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.
ఫిలిప్పీయులకు 2:13
ఎందుకనగా మీరు ఇచ్ఛయించుట కును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.
కీర్తనల గ్రంథము 119:44
నిరంతరము నీ ధర్మశాస్త్రము ననుసరించుదును నేను నిత్యము దాని ననుసరించుదును