కీర్తనల గ్రంథము 49:18
నీకు నీవే మేలు చేసికొంటివని మనుష్యులు నిన్ను స్తుతించినను తన జీవితకాలమున నొకడు తన్ను పొగడుకొనినను
Though | כִּֽי | kî | kee |
while he lived | נַ֭פְשׁוֹ | napšô | NAHF-shoh |
blessed he | בְּחַיָּ֣יו | bĕḥayyāyw | beh-ha-YAV |
his soul: | יְבָרֵ֑ךְ | yĕbārēk | yeh-va-RAKE |
praise will men and | וְ֝יוֹדֻ֗ךָ | wĕyôdukā | VEH-yoh-DOO-ha |
thee, when | כִּי | kî | kee |
thou doest well | תֵיטִ֥יב | têṭîb | tay-TEEV |
to thyself. | לָֽךְ׃ | lāk | lahk |
Cross Reference
ద్వితీయోపదేశకాండమ 29:19
అట్టి పనులను చేయు వాడు ఈ శాపవాక్య ములను వినునప్పుడు, మద్యముచేత దప్పి తీర్చు కొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును.
లూకా సువార్త 12:19
నా ప్రాణముతోప్రాణమా, అనేక సంవత్సరములకు,విస్తార మైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పు కొందునను కొనెను.
సమూయేలు మొదటి గ్రంథము 25:6
ఆ భాగ్యవంతునితోనీకును నీ యింటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి యీ వర్తమానము తెలియజెప్పవలెను.
ఎస్తేరు 3:2
కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరును రాజాజ్ఞాను సారముగా మోకాళ్లూని హామానునకు నమస్కరించిరి. మొర్దెకైవంగకయు నమస్కారము చేయకయు నుండగా
కీర్తనల గ్రంథము 10:3
దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురులోభులు యెహోవాను తిరస్కరింతురు
హొషేయ 12:8
నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనిని బట్టియు శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరును కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు.
అపొస్తలుల కార్యములు 12:20
తూరీయులమీదను సీదోనీయులమీదను అతనికి అత్యా గ్రహము కలిగినందున వారేకమనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పైవిచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసికొని సమాధాన పడవలెనని వేడుకొనిరి; ఎందుకనగా రాజుయొక్క దేశమునుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను.
ప్రకటన గ్రంథము 13:3
దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్టుండెను; అయితే ఆ చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరు మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి.