కీర్తనల గ్రంథము 83:7
గెబలువారును అమ్మోనీయులును అమాలేకీయులును ఫిలిష్తీయులును తూరు నివాసులును నీకు విరోధముగా నిబంధన చేసికొనియున్నారు.
Gebal, | גְּבָ֣ל | gĕbāl | ɡeh-VAHL |
and Ammon, | וְ֭עַמּוֹן | wĕʿammôn | VEH-ah-mone |
and Amalek; | וַעֲמָלֵ֑ק | waʿămālēq | va-uh-ma-LAKE |
Philistines the | פְּ֝לֶ֗שֶׁת | pĕlešet | PEH-LEH-shet |
with | עִם | ʿim | eem |
the inhabitants | יֹ֥שְׁבֵי | yōšĕbê | YOH-sheh-vay |
of Tyre; | צֽוֹר׃ | ṣôr | tsore |
Cross Reference
యెహొషువ 13:5
గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండదిగువ నున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవుమార్గ మువరకు లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిశ్రేపొత్మాయిము వరకును దేశము మిగిలియున్నది.
యెహెజ్కేలు 27:3
సముద్రపురేవులమీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణముచేయు వర్తకజనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాతూరు పట్టణమానేను సంపూర్ణ సౌందర్యము కలదాననని నీవను కొనుచున్నావే;
యెహెజ్కేలు 27:9
గెబలు పనివారిలో పనితెలిసిన పెద్దలు నీ ఓడలను బాగుచేయు వారుగా నున్నారు, సముద్రమందు నీ సరకులు కొనుటకై సముద్రప్రయాణముచేయు నావికుల యోడలన్నియు నీ రేవులలో ఉన్నవి.
సమూయేలు మొదటి గ్రంథము 4:1
ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయు టకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి.
సమూయేలు మొదటి గ్రంథము 15:2
సైన్యములకధిపతియగు యెహోవా సెల విచ్చినదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే, వారు ఐగుప్తులోనుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారిమీదికి వచ్చిరి గదా.
ఆమోసు 1:9
యెహోవా సెలవిచ్చునదేమనగాతూరు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్ప కుండ దానిని శిక్షింతును; ఏలయనగా దాని జనులు సహో దర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడినవారి నందరిని ఎదోమీయులకు అప్పగించిరి.