Revelation 14:5
వీరినోట ఏ అబద్ధమును కనబడలేదు; వీరు అనింద్యులు.
Revelation 14:5 in Other Translations
King James Version (KJV)
And in their mouth was found no guile: for they are without fault before the throne of God.
American Standard Version (ASV)
And in their mouth was found no lie: they are without blemish.
Bible in Basic English (BBE)
And in their mouth there was no false word, for they are untouched by evil.
Darby English Bible (DBY)
and in their mouths was no lie found; [for] they are blameless.
World English Bible (WEB)
In their mouth was found no lie, for they are blameless.{TR adds "before the throne of God"}
Young's Literal Translation (YLT)
and in their mouth there was not found guile, for unblemished are they before the throne of God.
| And | καὶ | kai | kay |
| in | ἐν | en | ane |
| their | τῷ | tō | toh |
| στόματι | stomati | STOH-ma-tee | |
| was mouth | αὐτῶν | autōn | af-TONE |
| found | οὐχ | ouch | ook |
| no | εὑρέθη | heurethē | ave-RAY-thay |
| guile: | δόλος· | dolos | THOH-lose |
| for | ἄμωμοί | amōmoi | AH-moh-MOO |
| are they | γάρ | gar | gahr |
| without fault | εἰσιν | eisin | ees-een |
| before | ἐνώπιον | enōpion | ane-OH-pee-one |
| the | τοῦ | tou | too |
| throne | θρόνου | thronou | THROH-noo |
| of | τοῦ | tou | too |
| God. | θεοῦ | theou | thay-OO |
Cross Reference
జెఫన్యా 3:13
ఇశ్రాయేలీయులలో మిగిలినవారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు; వారు ఎవరి భయము లేకుండ విశ్రాంతిగల వారై అన్నపానములు పుచ్చుకొందురు;
కీర్తనల గ్రంథము 32:2
యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు.
యూదా 1:24
తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి,
ఎఫెసీయులకు 5:27
నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
యోహాను సువార్త 1:47
యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచిఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతనిగూర్చి చెప్పెను.
కొలొస్సయులకు 1:22
తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను.
1 పేతురు 3:10
జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.
లూకా సువార్త 23:4
పిలాతు ప్రధాన యాజకులతోను జనసమూహములతోనుఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేద నెను.
మత్తయి సువార్త 12:34
సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా.
హొషేయ 10:2
వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అప రాధమునకు శిక్ష నొందుదురు; యెహోవా వారి బలిపీఠ ములను తుత్తునియలుగా చేయును, వారు ప్రతిష్టించిన దేవతాస్తంభములను పాడుచేయును.
దానియేలు 6:4
అందుకా ప్రధానులును అధిపతులును రాజ్య పాలన విషయములో దానియేలుమీద ఏదైన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయి నను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయి నను లోపమైనను కనుగొనలేకపోయిరి.
యెషయా గ్రంథము 53:9
అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు.
పరమగీతము 4:7
నా ప్రియురాలా, నీవు అధికసుందరివి నీయందు కళంకమేమియు లేదు.
సామెతలు 8:8
నా నోటి మాటలన్నియు నీతిగలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు
కీర్తనల గ్రంథము 55:11
దాని మధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి.
కీర్తనల గ్రంథము 34:13
చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచు కొనుము.