కీర్తనల గ్రంథము 22:2
నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు.
O my God, | אֱֽלֹהַ֗י | ʾĕlōhay | ay-loh-HAI |
I cry | אֶקְרָ֣א | ʾeqrāʾ | ek-RA |
in the daytime, | י֭וֹמָם | yômom | YOH-mome |
hearest thou but | וְלֹ֣א | wĕlōʾ | veh-LOH |
not; | תַעֲנֶ֑ה | taʿăne | ta-uh-NEH |
season, night the in and | וְ֝לַ֗יְלָה | wĕlaylâ | VEH-LA-la |
and am not | וְֽלֹא | wĕlōʾ | VEH-loh |
silent. | דֽוּמִיָּ֥ה | dûmiyyâ | doo-mee-YA |
לִֽי׃ | lî | lee |
Cross Reference
లూకా సువార్త 18:7
దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొను చుండగా వారికి న్యాయము తీర్చడా?
కీర్తనల గ్రంథము 88:1
యెహోవా, నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొఱ్ఱపెట్టునాడు
కీర్తనల గ్రంథము 42:3
నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయెను.
2 తిమోతికి 1:3
నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసికొనుచు, నీ కన్నీళ్లను తలచుకొని, నాకు సంపూర్ణా నందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు,
1 థెస్సలొనీకయులకు 3:10
మన దేవునియెదుట మిమ్మునుబట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఏలాగు చెల్లింపగలము?
లూకా సువార్త 22:41
ఆ చోటు చేరి ఆయన వారితోమీరు శోధనలో ప్రవే శించకుండునట్లు ప్రార్థనచేయుడని చెప్పి
లూకా సువార్త 6:12
ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను.
మత్తయి సువార్త 26:44
ఆయన వారిని మరల విడిచి వెళ్లి, ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థనచేసెను.
విలాపవాక్యములు 3:44
మా ప్రార్థన నీయొద్ద చేరకుండ నీవు మేఘముచేత నిన్ను కప్పుకొనియున్నావు.
విలాపవాక్యములు 3:8
నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడు.
కీర్తనల గ్రంథము 80:4
యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్లు నీ కోపము పొగరాజనిచ్చెదవు?
కీర్తనల గ్రంథము 55:16
అయితే నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును యెహోవా నన్ను రక్షించును.